SDPT: అక్కన్నపేట మండలంలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చౌటపల్లి మాజీ సర్పంచ్ గద్దల రమేష్ మాదిగ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకే తమను నిర్బంధించారని ఆరోపిస్తూ, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.