MNCL: బెల్లంపల్లిలో కురిసిన ఈదురు గాలులు వర్షాల కారణంగా 25వ వార్డులో చాంద్ బీ అనే మహిళ ఇంటి పైకప్పు కూలిపోయింది. విషయం తెలుసుకున్న MLA వినోద్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ స్వాతి పాల్గొన్నారు.