ప్రకాశం: కంభం మండలంలోని హజరత్ గూడెం గ్రామంలో ఎస్సై శివకృష్ణారెడ్డి ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలు, సైబర్ మోసాలు తదితర అంశాలపై గ్రామస్థులకు వివరించారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.