WNP: గోపాల్పేట మండల కేంద్రంలోని పద్మావతి గార్డెన్స్‌లో జూన్ 5న నూతనంగా ఎంపికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎక్కే వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.