MHBD: నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మగూడెం స్టేజీ వద్ద స్థానిక ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా, పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 145 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.