AKP: పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం గ్రామంలో ఈనెల 2వ తేదీన ముత్యాలమ్మ తల్లి పండగను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పండగ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.