BHPL: భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ రావు, పలిమెల మండలాల్లో మిగిలిపోయిన 300 మంది లబ్ధిదారులకు మంత్రి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం ధన్వాడ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు.