KDP: జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర DY CM పవన్ కల్యాణ్ పై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా ఇలా చేయడం మానుకోవాలని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సిద్దవటంలో తన నివాసంలో మాట్లాడారు. ప్రొఫసర్ నాగేశ్వరరావు వంటి వ్యక్తులు రాజకీయ నాయకుల ప్రభావానికి లోనై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.