TG: రేపు రాష్ట్ర జనసేన నేతలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్లో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.