కోనసీమ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సింగపూర్ ఓపెన్ డబుల్స్ విభాగంలో అమలాపురానికి చెందిన స్టార్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది. ఇండియన్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఈ విజయం ఎంతో ఆనందంగా, దేశానికి గర్వకారణంగా ఉందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్ బాబు ఆదివారం కొనియాడారు.