TG: సరస్వతి అంత్యపుష్కరాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల రద్దీ పెరిగింది. చివరి రోజు కావడంతో భక్తులు భారీగా పోటెత్తి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రసిద్ధ ముక్తేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.