AP: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ (SCR) కార్యకలాపాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నగరంలోని VMRDA డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. జోన్కు సంబంధించిన పరిపాలన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడలతో పాటు విశాఖపట్నం కలిపి 4 డివిజన్లతో జోన్ పని చేస్తుంది.