PLD: గురజాల మండలం పులిపాడులో ఆదివారం రైతు బండి శంకర్‌కు చెందిన 1300 వరి గడ్డి కట్టలు తగలబడిపోయాయి. గేదెల మేత కోసం దాచిన ఈ గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, దీనివల్ల తనకు రూ.2.5 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతు ఫిర్యాదుతో గురజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.