• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

సీఎం రేవంత్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు: NTR

దేవర టికెట్ ధరను పెంచుకునేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవర సినిమా కోసం జీవో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు.’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్&z...

September 24, 2024 / 01:50 AM IST

‘దేవర’ బుకింగ్స్ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘దేవర’ మూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిమిషాల వ్యవథిలోనే టికెట్లు ఖాళీ అయ్యాయి. రేపు రెండు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 27న 29 థియేటర్లలో అర్థరాత్రి ఒంటిగంట షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టికెట్లు రెట్లను పెంచుకునే వెసులుబాటును కూడా రెండు ...

September 23, 2024 / 10:08 PM IST

రేణుకాస్వామి కేసులో నిందితులకు బెయిల్

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌కు బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా వారిపై హత్యానేరం ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. కాగా ఈ హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు రాష్ట్రంలోని వివిధ జైళ్లలో రిమాండ్ ...

September 23, 2024 / 08:54 PM IST

‘దేవర’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

‘దేవర’ మూవీకి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీఫ్లెక్సుల్లో రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఇక సినిమా విడుదలయ్యే సెప్టెంబర్ 27న మొత్తం ఆరు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్‌పై రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు ఇస్తూ ఉత్తర్...

September 23, 2024 / 07:41 PM IST

‘సత్యం సుందరం’ మూవీ ట్రైలర్‌ రిలీజ్

తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్‌ స్వామి కాంబినేషన్‌లో దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ ‘సత్యం సుందరం’ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్‌, కార్తీ.. బావ- బావమరిదిగా నటించారు. కాగా ఈ నెల 28న థియేటర్లలో ప...

September 23, 2024 / 07:20 PM IST

‘ప్రతినిధి 2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘ప్రతినిధి’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ప్రస్తుత రాజకీయాలను ప్రశ్నించే జర్నలిస్టుగా రోహిత్ ఇందులో నటించారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈనెల 27న స్ట్...

September 23, 2024 / 06:40 PM IST

జానీ మాస్టర్‌ను కస్టడీకి.. పిటిషన్

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, జానీ మాస్టర్‌ను కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

September 23, 2024 / 05:40 PM IST

రూ.600 కోట్లు వసూళ్లతో ‘స్త్రీ 2’ అరుదైన రికార్డు

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్‌రావ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘స్త్రీ 2’ సినిమా అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకుపైగా వసూళ్లు(నెట్ కలెక్షన్స్) రాబట్టిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. 39 రోజుల్లో ఈ చిత్రం రూ.604.22 కోట్లు(నెట్) వసూల్ చేసిందని తెలిపింది. రూ.713 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిందని పేర్కొంది.

September 23, 2024 / 05:27 PM IST

ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: దేవిశ్రీ

అమెరికాలోని న్యూయార్క్ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మోదీ ఎదుట ప్రదర్శన ఇవ్వడంపై ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ స్పందించారు. ‘ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది. ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ క్షణాలను నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటా’ అని ఆయన అన్నారు. కాగా ఈ ప్రదర్శనకు వెళ్లిన మోదీ.. దేవీశ్రీతో పాటు మిగిలిన గాయకులను అలింగనం చేసుకున్నారు.

September 23, 2024 / 05:14 PM IST

‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొన్న పవన్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా నెలల గ్యాప్ తర్వాత తన సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం సమీపంలోని హరిహర వీరమల్లు సినిమా యూనిట్ మూవీ సెట్ వేసింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఈ మూవీ షూటింగ్‌లో పవన్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో పవన్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రక...

September 23, 2024 / 04:49 PM IST

చిన్న సినిమాకు భారీ లాభాలు

శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో.. రితేష్ రాణా దర్శకత్వం వహించిన మత్తువదలరా-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. కేవలం 10 రోజుల్లోనే రూ.30.01కోట్లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే అమెరికాలోనూ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ దాటేసినట్లు తెలిపారు. కాగా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ఊహించని ...

September 23, 2024 / 03:06 PM IST

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్

బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారిద్దరూ దూరంగా ఉంటున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలకు ఐశ్వర్య రాయ్ చెక్ పెట్టింది. ఆమె తమ వెడ్డింగ్ రింగ్ ధరించి ‘పారిస్ ఫ్యాషన్ వీక్’లో పాల్గొంది. దీంతో తాము విడాకులు తీసుకోబోతున్నామంటూ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లైంది.

September 23, 2024 / 02:55 PM IST

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై స్పందించిన ఆర్గనైజర్లు 

దేవర ప్రీ రిలీజ్ రద్దు కావడంపై అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఆర్గనైజేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పరిమితులకు మించి పాస్‌లు ఇచ్చామంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధం. 30, 35వేల మంది అభిమానులు హాజరయ్యారు. బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. అభిమానుల భద్రత దృష్ట్యా ఈవెంట్ రద్దు చేశాం. బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ను విడుదల చేస్తున్నాం’ అని పేర్కొన్న...

September 23, 2024 / 01:22 PM IST

BREAKING: 2025 ఆస్కార్‌ ఎంట్రీ.. సినిమా ఇదే

2025 ఆస్కార్‌కు భారత్ నుంచి ‘లాపతా లేడీస్’ సినిమాను ఎంట్రీకి పంపనున్నట్లు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఆట్టం, యానిమల్‌ తదితర 29 సినిమాల జాబితా నుంచి ఈ సినిమాను ఎంచుకున్నట్లు చెప్పింది. ఈ సినిమాకి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావ్‌ దర్శకత్వం వహించారు. కాగా, ఈ మూవీ ఆస్కార్‌కు వెళ్తుందనే నమ్మకముందని ఇటీవల కిరణ్‌రావ్...

September 23, 2024 / 01:07 PM IST

న్యూలుక్‌లో అదిరిపోయిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేశ్ బాబు న్యూ లుక్ అదిరిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ న్యూలుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్ బాబు కలిసి వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన చెక్కును అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన లుక్ వైరల్ అవుతోంది. తన తదుపరి చిత్రం SSMB 29లో ఆయన ఈ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.

September 23, 2024 / 12:45 PM IST