యంగ్ హీరోయిన్ల ప్రతిభపై సీనియర్ నటి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి నటీమణులు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారని, సెట్స్‌కు రాకముందే మేకప్, కాస్ట్యూమ్స్ వంటి విషయాల్లో పూర్తి హోంవర్క్ చేసుకుంటున్నారని కొనియాడారు. వారి ప్లానింగ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని, నిజానికి సీనియర్లమే వారి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆమె ప్రశంసించారు.