భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు తమిళ హీరో శింబు తనదైన శైలిలో అదిరిపోయే సమాధానమిచ్చాడు. ‘నేను హ్యాపీగా ఉండటం మీకు ఇష్టం లేదా? ఇప్పుడిప్పుడే నా సమస్యలన్నీ తీరిపోయి, ప్రశాంతంగా సినిమాలు చేసుకుందామనే మూడ్లో ఉన్నాను. ఇలాంటి టైంలో రాజకీయాల పేరుతో ఆ సంతోషాన్ని చెడగొట్టేలా ఉన్నారు’ అంటూ చమత్కరించాడు. ప్రస్తుతం తన దృష్టి కేవలం నటనపైనే ఉందని శింబు చెప్పాడు.