కోలీవుడ్ డైరెక్టర్ల పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉంది. మణిరత్నం, కార్తీక్ సుబ్బరాజ్ తమ తదుపరి మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండగా, లోకేష్ కనగరాజ్ ఏకంగా హీరోగా మారుతున్నాడు. అయితే శంకర్ పరిస్థితి మరింత ఆసక్తికరం. వరుస ప్లాపులతో తదుపరి సినిమా ఆలస్యమవుతుండటంతో, ఆయన నటుడిగా మారబోతున్నట్లు సమాచారం. రజినీకాంత్ 173వ చిత్రంలో శంకర్ విలన్గా నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.