హీరో అడివి శేష్ సినిమాల్లోని తన పాత్రల పేర్లు(రిషి, విక్రమ్ వాసుదేవ్, గోపి, హరిదాస్) అన్నీ విష్ణుమూర్తికి సంబంధించినవే ఉండటంపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. తాను సత్యనారాయణ స్వామి భక్తుడినని, అందుకే ఆ పేర్లంటే ఇష్టమని తెలిపాడు. తన సోదరి శివ భక్తురాలైనప్పటికీ, ఆమెకు పుట్టిన బాబుకు తానే ‘కేశవ’ అని నామకరణం చేసినట్లు శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.