మెక్సికోలో జరుగుతున్న 41వ గ్వాడలజరా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అస్సాం మూవీ ‘ఏ టీచర్స్ గిఫ్ట్’ విశేష ఆదరణ పొందుతోంది. రాజ్దీప్ స్వయంగా నటించి, కథ అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రదర్శితమైంది. ప్రతిష్టాత్మక ‘ప్రెమియో మాగీ’ విభాగంలో పోటీ పడుతూ, బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 పరిశీలనలోనూ నిలిచి అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.