బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి అషురెడ్డి, ఆమె ఫ్యామిలీ రూ.9.35 కోట్లు కాజేశారని షేక్‌పేట్‌కు చెందిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్లు, ఫ్లాట్లు, బంగారం కొన్నారని ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారని వాపోయారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.