హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘సన్నీ సంజయ్’ మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలను ఈ ఏడాదే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు భాను భోగవరపు, పవన్ బసంశెట్టిలతో కూడా కొత్త ప్రాజెక్టుల చర్చలు జరుపుతున్నాడు.