తమపై వచ్చిన ట్రోల్స్‌పై నటుడు జయం రవి చేసిన వ్యాఖ్యలకు ఆయన భార్య ఆర్తి ఘాటుగా బదులిచ్చారు. పురుషులే అసలైన బాధితులన్న రవి మాటలపై ఆమె స్పందిస్తూ.. ఒక మహిళ విడాకులకు ముందే వేరే వ్యక్తితో కనిపిస్తే సమాజం అంగీకరిస్తుందా? అని ప్రశ్నించింది. మరి పురుషుడు అదే పని చేస్తూ బాధితుడినని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్.. ఇలాంటి అసహ్యమైన ప్రవర్తన గర్వించదగ్గది కాదని ఆమె పోస్ట్ చేసింది.