IPLలో రోహిత్ శర్మను కేవలం ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా కాకుండా, పూర్తిస్థాయి ప్లేయర్గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. హిట్మ్యాన్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని, కెప్టెన్గా ఇప్పటికే 5 ట్రోఫీలు అందించిన అనుభవం అతడికి ఉందని గుర్తు చేశాడు. అలాంటి ప్లేయర్ సేవలను మైదానంలో పూర్తిస్థాయిలో వాడుకోవాలని అభిప్రాయపడ్డాడు.