కృష్ణా: మచిలీపట్నం మండలం ఇంగ్లీష్ పాలెంలోని గౌసియా మసీదులో నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్ర శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలు ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాస దీక్ష చేయడం వారి భక్తి నియమానికి నిదర్శనమని అన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.