SKLM: రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం తెలిపారు. ఈ మేరకు కానూరులోని పౌర సరఫరాల భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ గ్యాస్ కొరత లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.