AP: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గ్యాస్ కొరతను దొంగలు సొమ్ము చేసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి ఓ ఇంట్లో చొరబడిన దుండగులు గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లారు. బయటకు వెళ్లొచ్చిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఒకవైపు గ్యాస్ దొరకడమే కష్టంగా ఉంటే, ఉన్న సిలిండర్ కూడా చోరీకి గురవ్వడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.