WG: తణుకు కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1,104 కేసులు రాజీ చేసినట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి తెలిపారు. వీటిలో 170 క్రిమినల్ కేసులు, 922 బెంచ్ కోర్టు కేసులు, 12 ప్రిలిటిగేషన్ కేసులు రాజీ చేసినట్లు తెలిపారు. మొత్తం అన్ని కేసులలో అవార్డు అమౌంట్ కింద రూ. 24.52 లక్షలు మేర ఇరుపక్షాలకు అందజేసినట్లు ఆమె వెల్లడించారు.