ELR: నూజివీడు పట్టణంలోని కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 9,163 కేసులు రాజీకి వచ్చి పరిష్కరింపబడినట్లు 15వ అదనపు జిల్లా జడ్జ్ ఏ నాగ శైలజ తెలిపారు. సివిల్ కేసులు 54, క్రిమినల్ కేసులు 111, పెట్టి కేసులు 9,000 రాజీకి వచ్చి పరిష్కరించడం జరిగిందన్నారు. వివిధ కేసులలో రూ. 43,481,000 లక్షలు సెటిల్మెంట్ చేయడం జరిగిందన్నారు.