AP: NTR జిల్లా దేవునిచెరువు గ్రామ ప్రభుత్వ బడి పిల్లలకు నాణ్యతలేని భోజనం పెట్టడంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన ఆయన.. విషయం తెలిసిన వెంటనే బాధ్యులపై చర్యలతో పాటు స్కూల్ హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేశామన్నారు. విద్యార్థుల ఉత్తమ సంరక్షణ, నాణ్యమైన సేవలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.