MBNR: PU ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్. శ్రీనివాస్ బుధవారం బీటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే. ప్రవీణ, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. చంద్ర కిరణ్ పాల్గొన్నారు.