MHBD: జిల్లా కేంద్రంలోని వివిధ మండలాలలో SFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా SFI అధ్యక్షులు జ్యోతి బసు, మధు మాట్లాడుతూ.. వివిధ మండలాల నుంచి 100 మంది విద్యార్థులు పరీక్ష రాశారని తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు జిల్లా స్థాయి టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో SFI జిల్లా నేతలు ఉన్నారు.