ASR: గంజాయితో సంపాదించిన ఆస్తులు సీజ్ చేయడం జరుగుతుందని పాడేరు డీఎస్పీ అభిషేక్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. పాడేరు మండలం పాలమామిడిశంఖ గ్రామానికి చెందిన డుంబెరి సతీష్ కుమార్ గంజాయి వ్యాపారం చేస్తూ పలుమార్లు పట్టుబడ్డాడన్నారు. సీఐ దీనబంధు విచారణ జరిపి రూ.34,93,031 ఆస్తులు సంపాదించినట్లు గుర్తించామన్నారు. ఆస్తులను ఫ్రీజ్ చేయడం జరిగిందన్నారు.