MNCL: డ్రైనేజీలలో ప్రజలు చెత్త వేయవద్దని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, 15వ వార్డు కౌన్సిలర్ గోప సుజాత చిన్న రమేష్ సూచించారు. మంగళవారం వార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రైనేజీలలో చెత్తను తీయించి, గడ్డి పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు.