NZB: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV) హాస్టల్లో వంట మనిషి పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రత్యేకాధికారిణి గంగామణి తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉండి, 10వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 17 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.