నల్గొండలోని ఎన్జీ కళాశాలలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డా. BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ విద్యార్థులకు 2, 4, 6 సెమిస్టర్లకు తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆ కళాశాల కోఆర్డినేటర్ డా. అనిల్ కుమార్ తెలిపారు. విద్యార్థులు తప్పక హాజరు కావాలని పేర్కొన్నారు. సకాలంలో హాజరై క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.