గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్కు లైన్ క్లీయర్ అయింది. వర్షం తగ్గడంతో మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రాత్రి 8 గంటలకు టాస్ పడనుండగా, 8:15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ ఓవర్లలో ఎలాంటి కోత లేదు. 20 ఓవర్ల పూర్తి మ్యాచ్ జరగనుంది.