ASR: జిల్లాలో రెవెన్యూ సంబంధించిన అంశాలపై సత్వరమే చర్యలు తీసుకోవాలని జేసీ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో వీసీ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.