JN: లింగాల ఘనపూర్ మండలం కిష్టగూడెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నర్సింగరావు తండ్రి సోమాజి ప్రథమ సంవత్సరికం కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.