MLG: ‘ప్రజా పాలన-ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగపేట మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో MPDO బద్రు నాయక్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ సమావేశం నిర్వహించారు. MPDO మాట్లాడుతూ.. వివిధ శాఖల అధికారులు చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు ఉన్నారు.