ఏలూరు: నగరంలోని వన్ టౌన్ 8వ డివిజన్లోని కొత్త రోడ్డులో శ్రీ ఆదర్శ ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణ పనులకు నిర్వాహకులు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. అనంతరం ఆలయం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.