ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతయ్య ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి భారతీయ వ్యక్తి. గాంధీ(1982) సినిమాకు గాను ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మ అవార్డ్ దక్కింది. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె లగాన్, స్వదేశ్ వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన డిజైన్లు అందించారు. మన భారతీయ సినిమా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కళాకారిణిగా చరిత్రలో నిలిచిపోయారు.