ప్రతిరోజు గుప్పెడు నట్స్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండె జబ్బులు దరిచేరవు. క్యాన్సర్ వంటి వ్యాధులు తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
డైనింగ్ టేబుల్ మీద కంటే నేలపై కూర్చొని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేలపై కూర్చొని తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. కండరాలు దృఢంగా మారుతాయి. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి నేలపై కూర్చొని తింటే వారి మధ్య బంధం మరింత బలపడుతుంది.
ఉదయం లేవగానే పిల్లలతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగించాలి. కావాలంటే అందులో టీస్పూన్ తేనె, నిమ్మరసం యాడ్ చేయొచ్చు. రాత్రి నీటిలో నానబెట్టిన 4-5 ఎండుద్రాక్షలను పరగడుపున తినిపించాలి. రోజూ వ్యాయామాలు చేయించాలి. గోరువెచ్చని పాలలో అరటీస్పూన్ ఆవు నెయ్యి కల్పి రాత్రి పడుకునే ముందు వారితో తాగించాలి. స్ట్రాబెర్రీ, అవకాడో, ఓట్స్, యాపిల్స్ వంటి పండ్లను తినిపించాలి.
రోజుకు ఒకటి లేదా రెండు సార్లు సబ్జా గింజలను తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. శరీర వేడిని తగ్గిస్తాయి. బరువును, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతాయి. అయితే సబ్జా గింజలను అధికంగా తీసుకుంటే విరేచనాలు, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
కుడి చేతితో చేసే పనులను ఎడమ చేతితో చేయడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని కాలిఫోర్నియా వర్సిటీ అధ్యయనం చెబుతోంది. దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇలాంటి చిన్న సవాళ్లు మెదడులో కొత్త నాడీ సంబంధాలను ఏర్పరుస్తాయి. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజూ చేసే బ్రషింగ్ను ఎడమ చేతితో చేయడం వల్ల మొదడుకు కొత్త సవాళ్లు ఎదురై యాక్టివ్గా మారుతుంది.
ప్రతి రోజూ 5 నిమిషాలు నవ్వితే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా నవ్వడం వల్ల మన శరీరంలో ‘ఎండార్ఫిన్స్’ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజంగా నొప్పి నివారిణిగా పనిచేస్తాయి.
వెల్లుల్లిలో ఉండే సల్పర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం 3, 4 వెల్లుల్లి రెబ్బలను ఖాళీ కడుపుతో తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి వైరస్ వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. దగ్గు, జ్వరం, జలుబును అరికడుతుంది.
క్యారెట్లు కంటి చూపునకు మంచివని నిపుణులు చెబుతున్నా.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యారెట్లు తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు క్యారెట్లు తినకుండా ఉంటే మంచిది. క్యారెట్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కడుపుకు మంచిదే. అయితే, ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం ఏర్పడుతుంది.
చాలామంది వయసుకు, ఎత్తుకు సంబంధం లేకుండా బరువు పెరుగుతుంటారు. అయితే, అధిక బరువు వల్ల ఐదు రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 ఏళ్లు పైబడిన వారిలో థైరాయిడ్, గర్భాశయం, రొమ్ము, లుకేమియా, మూత్రపిండాల క్యాన్సర్లు పెరిగినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. యువతలో ఈ తరహా క్యాన్సర్లు పెరుగుతున్నట్లు తెలిసింది.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం. దీని వల్ల ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గి రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇది మీ జీవితానికే కాకా, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే జరిమానా, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవు. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యానికి దూరంగా ఉండటం మంచింది.
వారంలో ఒక్క రోజు దొరికే ఆదివారం వృధాగా గడిచిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయండి. సరదాగా ఇంట్లో వాళ్లతో కలిసి ఇల్లు శుభ్రం చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి సినిమాలు/వెబ్ సిరీస్లు చూడడం సంతోషాన్నిస్తుంది. అలాగే మీ వాళ్లను వారం మొత్తం ఎలా గడిచిందని, ఏమైనా సమస్యలున్నాయేమో అడిగి తెలుసుకోండి. అవసరమైతే సలహాలు ఇవ్వండి. పుస్తకం చదవడం కూడా మంచిదే.
పిల్లలపై తల్లిదండ్రులు వాళ్ల ఇష్టాలను రుద్దుతుంటారు. నిజానికి చిన్నప్పట్నుంచే పిల్లలకు కొన్ని ఇష్టాలు ఏర్పడుతాయి. అందుకే తల్లిదండ్రుల ఇష్టాలు కాకుండా.. వాళ్లకి నచ్చిన హాబీలు, ఆటలు ప్రయత్నించనివ్వండి. కొన్ని రోజుల్లోనే ఆసక్తి లేదు. ఇంకోటి ప్రయత్నిస్తా అని చెప్పినా సరే.. చేయనివ్వండి. ఆసక్తి కలిగిన చోట సృజనకు తావుంటుంది. కాబట్టి అమ్మానాన్నలూ పిల్లల ఇష్టాలేంటో గమనించండి.
✦ అధిక జ్వరం✦ తీవ్రమైన తలనొప్పి, వాంతులు✦ నిద్రలేమి సమస్య✦ ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి✦ సురక్షితమైన నీటిని తాగాలి✦ భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. అయితే కొంతమంది హెయిర్ స్టైల్ చెదురుతుందని.. వెంట్రుకలు ఊడుతాయని కొందరు.. వాహనం నడుపుతున్నాననే గుర్తింపు కోసం హెల్మెట్ ఉపయోగించరు. కానీ హెల్మెట్ వాడటం వల్ల వెంట్రుకలు ఊడిపోతాయనేది అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజూ ఉదయం స్కిప్పింగ్ చేయడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గుతారు. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కండరాలు బలంగా మారుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.