సూర్య నమస్కారం కృతజ్ఞతతో కూడిన 12 ఆసనాల సమాహారం. ఉదయం ఖాళీ కడుపుతో తూర్పు ముఖంగా చేస్తే రక్త ప్రసరణ, జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గుతారు. దీనితో పాటు 15 నిమిషాల ఉదయపు ఎండ వల్ల ఎముకలకు మేలు చేసే విటమిన్-డి అందుతుంది. ఇది రాత్రి పూట హాయిగా నిద్ర పట్టడానికి సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.