• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

మంచిమాట: మీ విలువను పెంచుకోవాలంటే.. !

ఈ రోజు ఏం చేయాలి అని కాదు, ఏ సమస్యలు పరిష్కరించాలి అని ఆలోచించండి. మీరు ఎన్ని ఎక్కువ సమస్యలను పరిష్కరిస్తారో, సమాజంలో అంత ఎక్కువ విలువను సృష్టిస్తారు. ఫలితంగా మీ వ్యక్తిగత విలువ, గుర్తింపు కూడా పెరుగుతాయి. సమస్యలను ఎదుర్కొని పరిష్కారం చూపడమే మీ ఎదుగుదలకు అసలైన బాట.

May 31, 2026 / 11:30 AM IST

రోజూ కిలోమీటరు నడిస్తే.. ఎన్ని లాభాలో తెలుసా?

రోజూ కిలోమీటరు వాకింగ్‌ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నడిచేటప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్‌ హార్మోన్లు విడుదలవుతాయి. మనసుకు ప్రశాంతతను కలిగించి ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట, నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్యలు తగ్గి జీవక్రియ వేగవంతమవుతుంది.

May 31, 2026 / 08:37 AM IST

యోగనిద్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు

యోగనిద్రాసనం అనేది శారీరక, మానసిక ఒత్తిళ్లను తగ్గించి, గాఢమైన విశ్రాంతినిచ్చే అద్భుతమైన పద్ధతి. మెదడుపై భారాన్ని తగ్గించి, నెగెటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. నిద్రలేమి సమస్యను దూరం చేసి, గాఢమైన నిద్రను పట్టేలా చేస్తుంది. 20 నిమిషాల యోగ నిద్ర.. దాదాపు 2 గంటల సాధారణ గాఢ నిద్రతో సమానమైన విశ్రాంతిని ఇస్తుంది.

May 31, 2026 / 06:48 AM IST

భారత్‌కు ‘ద్వంద్వ ఆరోగ్య ముప్పు’

భారత్ తీవ్ర ‘ద్వంద్వ ఆరోగ్య ముప్పు’ను (ఊబకాయం, పోషకాహార లోపం) ఎదుర్కొంటోందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్నారని తెలిపింది. జీవనశైలి వ్యాధులు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయని పేర్కొంది. 2023-24లో 715 జిల్లాల్లోని 6.79 లక్షల ఇళ్లలో కేంద్రం ఈ సర్వే నిర్వహించింది.

May 31, 2026 / 12:38 AM IST

మౌన వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా?

శరీరంలోని శక్తి మాటల రూపంలో వృథా కాకుండా కాపాడుకోవడమే మౌన వ్రతం ముఖ్య ఉద్దేశం. మౌనం అంటే మాట్లాడకపోవడమే కాదు మనసులోని ఆలోచనలను నిశ్శబ్దం చేయడం. ఇది ఒత్తిడిని, కోపాన్ని తగ్గించి రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే మెదడుకు విశ్రాంతినిస్తూ మనోబలాన్ని, ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది.

May 30, 2026 / 09:00 PM IST

జుట్టు రాలడానికి, క్యాన్సర్‌కు సంబంధం ఉందా?

జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే క్యాన్సర్ వచ్చిందేమోనని చాలా మంది భయపడుతుంటారు. అయితే ఇది కేవలం అపోహేనని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలుతుందట. క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ వల్ల మాత్రమే తాత్కాలికంగా జుట్టు ఊడుతుంది కానీ, సాధారణంగా జుట్టు రాలడానికి క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

May 30, 2026 / 08:28 PM IST

జీరా వాటర్ తాగుతున్నారా?

మగవారు రోజూ ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట గ్లాస్ నీటిలో చెంచా జీలకర్ర నానబెట్టి, ఉదయం వడకట్టి తాగాలి. ఇది వేసవిలో శరీరానికి చలవ చేస్తుంది. వారం రోజుల పాటు తాగితే పురుషుల్లో జీర్ణక్రియ మెరుగై ఎసిడిటీ, కడుపునొప్పి, ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి.

May 30, 2026 / 07:39 PM IST

ఒక్క నిమిషంలోనే బద్ధకానికి చెక్

ఉదయాన్నే లేవడానికి బద్ధకించే వారి కోసం జపనీస్ యువత ‘కైజెన్’ (వన్ మినిట్ రూల్) పాటిస్తారు. రోజుకు కేవలం ఒకే ఒక్క నిమిషం పాటు ఒక పుష్-అప్ చేయడం, ఒక వాక్యం చదవడం లేదా ధ్యానం లాంటి చిన్న పనులతో రోజును ప్రారంభించడమే ఈ పద్ధతి. దీనివల్ల క్రమశిక్షణ పెరిగి బద్ధకాన్ని సులువుగా వదిలించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

May 30, 2026 / 03:17 PM IST

వారు.. వంకాయ కూర అస్సలు తినొద్దు!

కొందరికి వంకాయ కూర తింటే వెంటనే దురద పెడుతుంది. అలాగే, శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారిలో జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. వీటిని తిన్న తర్వాత వంకాయల్లో ఉండే ఫైబర్ కడుపు నొప్పి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. వంకాయలో ఆక్సలేట్లు ఎక్కువ ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు అస్సలు టచ్ చేయకూడదు. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు వీటిని తినొద్దు.

May 30, 2026 / 10:53 AM IST

వీరభద్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు

వీరభద్రాసనం (వారియర్ పోజ్) క్రమం తప్పకుండా చేస్తే శారీరకంగా, మానసికంగా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. చేతులు, భుజాలు, తొడలు, పిరుదులు, చీలమండల కండరాలు బలపడతాయి. శరీరం యొక్క సమతుల్యతను, స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీని విస్తరింపజేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, శ్వాసవ్యవస్థ మెరుగుపడుతుంది.

May 30, 2026 / 07:20 AM IST

గాఢ నిద్ర కోసం ఈ చిట్కాలు పాటించండి!

శారీరక, మానసిక ఆరోగ్యానికి రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల చిరాకు, ఏకాగ్రత తగ్గడం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పడుకోవడానికి గంట ముందే ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవడం, గదిని ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.

May 30, 2026 / 01:10 AM IST

అక్వేరియం చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు

ఒత్తిడితో బాధపడే వారికి అక్వేరియం అద్భుతమైన థెరపీలా పనిచేస్తుంది. చేపల కదలికలను చూడటం వల్ల మెదడులో ఒత్తిడి హార్మోన్ ‘కార్టిసాల్’ తగ్గి, BP అదుపులోకి వస్తుంది. అక్వేరియం నీటి సవ్వడి నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఇది పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి, వృద్ధుల ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు దీనిని చూడటం వల్ల మనసు ప్రశాంతంగా మారి గాఢ నిద్ర పడుతుంది.

May 29, 2026 / 09:33 PM IST

ఆలస్యంగా భోజనం చేస్తున్నారా…?

రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల అధిక బరువు పెరుగే అవకాశం ఉంది. ఇది నిద్రలేమికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి 8 గంటల లోపే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

May 29, 2026 / 09:28 PM IST

పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా..?

మీరు చేసే పనిపై ఏకాగ్రత లోపించినప్పుడు 25 నిమిషాల పాటు పూర్తి ఏకాగ్రతతో పనిచేసి, ఆ తర్వాత 5 నిమిషాల పాటు చిన్న బ్రేక్ తీసుకోవాలి. పని సమయంలో పరధ్యానం కలగకుండా ఉండటానికి మొబైల్ ఫోన్‌ను సైలెంట్‌లో ఉంచి, SM నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ లేదా పని ఉన్నప్పుడు అయోమయానికి గురికాకుండా, వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని పూర్తి చేయాలి.

May 29, 2026 / 07:54 PM IST

టీ తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

మనలో చాలా మందికి టీ తాగనిదే రోజు ప్రారంభమవదు. టీలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మానసిక ఒత్తిడి, పని వల్ల కలిగే స్ట్రెస్ నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. అల్లం టీ, చామోమిల్ టీ లాంటి హెర్బల్ టీలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. నార్మల్ టీ కంటే.. బ్లాక్ టీ, గ్రీన్ టీ వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

May 29, 2026 / 05:17 PM IST