రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బార్లీ నీళ్లు తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇందులోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. బరువు అదుపులో ఉంటుంది. మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య దూరమవుతుంది. రక్తపోటు, డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. వృద్ధాప్య సమస్యలు తగ్గుతాయి.
మీరు ఆనందంగా ఉన్నారా? అయితే ఈరోజు చేయాల్సిన పనులు చకచకా చేసేయండి. ఒకవేళ మీరు బాధల్లో ఉంటే.. అప్పుడు కూడా మీరు ప్రణాళిక ప్రకారం చేయాల్సిన పనులను ఆపొద్దు. అదే విధంగా మీకు ఈరోజు పని చేయాలన్న ఆసక్తి ఉన్నా, లేకున్నా, అసహనం, నిరుత్సాహం.. ఇలా మీ మానసిక స్థితి ఎలా ఉన్నా సరే, దానితో సంబంధం లేకుండా పనిని కొనసాగించడానికి కట్టుబడి ఉండటం అత్యంత విలువైన నైపుణ్యం. దాన్ని మీరు సాధనతో సొంతం చేసుకోండి.
చాలామంది కుక్కలను పెంచుకోవడంతోపాటు వాటిని ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం చేస్తుంటారు. కుక్కలను ముద్దు పెట్టుకోవడం వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటి నోటిలో సాల్మొనెల్లా, పాస్ట్యూరెల్లా, బార్టోనెల్లా వంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మానవులలో జీర్ణాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను కలిగిస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రమాదానికి గురవుతారు.
తెలంగాణలో నిర్వహించే అతిపెద్ద ప్రకృతి పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ సంబురాలను ఒక్కోరోజు ఒక్కో పేరుతో జరుపుకుంటారు. 1. ఎంగిలి పూల బతుకమ్మ2. అటుకుల బతుకమ్మ3. ముద్దపప్పు బతుకమ్మ4. నానబియ్యం బతుకమ్మ5. అట్ల బతుకమ్మ6. అలిగిన బతుకమ్మ7. వేపకాయల బతుకమ్మ8. వెన్నముద్దల బతుకమ్మ9. సద్దుల బతుకమ్మ.
ప్రపంచ అల్జీమర్స్ డేని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. అల్జీమర్స్ అనేది జ్ఞాపకశక్తిని ప్రభావితం చేసే మెదడు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, మెదడుకు వ్యాయామం, సామాజిక కార్యకలాపాలు వంటివి అల్జీమర్స్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
నువ్వుల లడ్డూలు కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు, చర్మ సమస్యలు తగ్గుతాయి.
బతుకమ్మను పేర్చడం గుమ్మడి ఆకులతో మొదలై.. గుమ్మడి పువ్వులోని గౌరమ్మను ప్రతిష్టించడంతో పూర్తవుతుంది. పండగతోపాటే గుమ్మడి తీగ కూడా మొగ్గలు తొడుగుతుంది. ఈ పూలలో సహజసిద్ధ ‘పసుపు గౌరమ్మ’ కొలువై ఉంటుంది. గుమ్మడికాయలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటుంది. వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది.
పితృ దేవతల ప్రీతికి అన్నం, జలం, క్షీరం, కందమూలములు, ఫలాల్లో వేటినైనా సమర్పించవచ్చు. ఇలా అవకాశం లేనివారు తిల తర్పణం చేయొచ్చు. అదీ అవకాశం లేకపోతే నదులు, సముద్రాల్లో లేదా వాపీ కూప తటాకాల్లో లేదా ఇంట్లోనైనా సరే స్నానం ఆచరించి పితృస్తుతి చేసి జల తర్పణమైనా ఇవ్వొచ్చు. వస్త్ర, అన్నదానం చేస్తే మేలు.
రేపు అమావాస్య రోజు.. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక సూర్య గ్రహణం. భారత కాలమాన ప్రకారం రాత్రి 10.59 గంటల నుంచి తెల్లవారుజామున 3.23గంటల వరకు ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదని పండితులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా, అంటార్కిటికా, అట్లాంటిక్, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది.
చాలామంది బాత్రూమ్లోనే గుండెపోటుకు గురవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో బాత్రూమ్ అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా అభివర్ణించారు. మలబద్ధకం సమస్య ఈ ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారు మలవిసర్జనకు ఎక్కువ ఒత్తిడి పెడితే.. గుండెకు రక్త సరఫరా తగ్గి BP పడిపోతుంది. చివరికి మెదడుకు వెళ్లే ఆక్సిజన్ సరఫరా తగ్గి.. హార్ట్ ఎటాక్ వస్తుందన్నారు.
పుట్టగొడుగులతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తాయి. కండరాలు, ఎముకలను దృఢంగా మారుస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి.
మీరు ఎవరి కన్నా ముందంజలో లేరు. అలాగే మీరు ఎవరికన్నా వెనుకబడి కూడా లేరు. మీరు మీదైన వేగంతో ముందుకెళ్తున్నారు. మీరు మీతో మాత్రమే పోటీపడుతున్నారు. నిన్నటి కన్నా ఈరోజు మెరుగైన ఫలితాలు సాధించడమే ఆ పోటీ . ఇతరులతో పోల్చుకోవడం మానేసినప్పుడే మీరు మీపైన విజయం సాధించడంపై దృష్టి పెట్టగలరు.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే లసోడా పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండ్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేయడంతో పాటు శరీరంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
త్వరలోనే తాము ఓ గొప్ప పనిని మొదలుపెట్టబోతున్నట్లు కనిపించిన ప్రతి ఒక్కరికీ చెప్పుకోవడం చాలా మందికి అలవాటు. తాము చేయబోయే పని గురించి ఎంత వర్ణించి చెప్పినా ఉపయోగం ఉండదు. నిజంగా ఆ పని మొదలుపెట్టిన తర్వాతే ఫలితాలు రావడం మొదలవుతుంది. ప్రగల్భాలు పలకకుండా పనిపైన దృష్ట పెట్టేవారే ఈ లోకాన్ని మార్చగలరు. మాటలతో కాకుండా చేతలతో ఆదర్శంగా నిలిచినప్పుడే అందరిలో స్ఫూర్తి కలుగుతుంది.
పచ్చి బొప్పాయి తినడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె, కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. గాయాలు త్వరగా మానిపోతాయి. చర్మ సమస్యలు దూరమవుతాయి.