• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

సమ్మర్ ఎఫెక్ట్.. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త..!

వేసవి ఎండల తీవ్రత వల్ల పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజంతా తగినంత మంచి నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఇస్తుండాలి. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉండే ఉ.10 నుంచి సా.4 గంటల వరకు పిల్లలను బయట తిరగనివ్వకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే టోపీ లేదా గొడుగు వాడాలి. ఆయిల్ ఫుడ్ కాకుండా పెరుగు, మజ్జిగ వంటి చలువ చేసే ఆహారాన్ని అందించడంతో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

March 13, 2026 / 12:53 PM IST

అరిటాకులో భోజనం చేస్తే కలిగే లాభాలు

అరిటాకులో భోజనం కేవలం సంప్రదాయమే కాదు, ఒక అద్భుత ఆరోగ్య రహస్యం. ఇందులో ఉండే పాలీఫినాల్స్ సహజ యాంటీ ఆక్సిడెంట్లను అందించి ఆహారాన్ని శుద్ధి చేస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు హానికర బ్యాక్టీరియాను చంపి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తూ ఆకలిని పెంచుతాయి. రసాయనాలు లేని ఈ పర్యావరణహిత పద్ధతి సంపూర్ణ ఆరోగ్యానికి సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.

March 13, 2026 / 12:32 PM IST

మెట్లెక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోజుకు కనీసం 10 నిమిషాలు మెట్లెక్కితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. వేగంగా క్యాలరీలు ఖర్చయి బరువు తగ్గుతారు. కాళ్లు, తుంటి, పొత్తికడుపు కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి సామర్థ్యం పెరుగుతుంది. ఎముకల సాంద్రత పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్రమం తప్పకుండా మెట్లెక్కడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

March 13, 2026 / 11:47 AM IST

భాగ్యనగరంలో హెల్తీ ట్రెండ్.. హోమ్ ఫుడ్!

TG: HYD నగరవాసులు ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్ జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ వెజ్ వీక్, నో అవుట్ సైడ్ ఫుడ్ వంటి కొత్త పద్ధతులను పాటిస్తున్నారు. ముఖ్యంగా యువత ఇంటి భోజనానికే ప్రాధాన్యతనిస్తోంది. ఆఫీసుల్లో సహోద్యోగులందరూ కలిసి హోమ్ ఫుడ్ డేస్ నిర్వహించడం ఇప్పుడు నగరంలో ఒక సరికొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌గా మారింది.

March 13, 2026 / 11:30 AM IST

బ్లాక్‌ కాఫీ తాగితే ఇన్ని లాభాలా..?

చాలామందికి కాఫీతోనే రోజు ప్రారంభమవుతుంది. కాఫీ వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచి అలసటను తగ్గిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక్ కాఫీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మెటాబాలిజాన్ని పెంచి శరీరంలో నిల్వైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

March 13, 2026 / 10:32 AM IST

20 నిమిషాల వ్యాయామం.. రోజంతా ఉల్లాసం

జిమ్‌కి వెళ్లలేకపోయినా రోజుకు 20 నిమిషాలు ఇంట్లోనే వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీనివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.. మధుమేహం వంటి వ్యాధుల ముప్పును తగ్గించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. శారీరక దృఢత్వంతో పాటు మెరుగైన మూడ్ సొంతమవుతుంది.

March 13, 2026 / 09:54 AM IST

పొట్ట కొవ్వును తగ్గించే అద్భుత ఆసనం ఇదే..!

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించేందుకు నౌకాసనం ఉత్తమమైనది. నేలపై వెల్లకిలా పడుకుని గాలి పీలుస్తూ కాళ్లు, ఛాతి భాగాన్ని ఒకేసారి గాలిలోకి లేపి చేతులను మోకాళ్లకు సమాంతరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పొట్ట కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగి అక్కడ పేరుకున్న కొవ్వు కరుగుతుంది. ఇది బరువు తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వెన్నెముకను దృఢంగా మార్చడంలో కూడా తోడ్పడుతుంది.

March 13, 2026 / 07:59 AM IST

చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్‌ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్.. *చాపింగ్​బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.

March 12, 2026 / 09:27 PM IST

వ్యాక్సిన్ & మెడిసిన్ మధ్య తేడా ఇదే..!

వ్యాధి రాకుండా ముందుగా వేసుకునేది వ్యాక్సిన్. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్‌లతో పోరాడుతుంది. అదే ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత నయం చేయడానికి వాడేవి మందులు. టీకాలను వైరస్ లేదా బ్యాక్టీరియా జన్యువుల నుంచి తయారు చేస్తారు. మెడిసిన్స్‌ను రసాయనాలతో రూపొందిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యాక్సిన్ నిరోధిస్తుంది, మెడిసిన్ చికిత్స చేస్తుంది.

March 12, 2026 / 06:32 PM IST

దాల్చిన చెక్క.. షుగర్ కంట్రోల్

డయాబెటిస్ ఉన్నవారు ఉదయం టీ/కాఫీలో చక్కెర బదులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవడం లేదా దాల్చిన చెక్క పొడి కలిపిన నీళ్లు తాగడం మంచిది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడం ద్వారా ఉబ్బరం, గ్యాస్, అజీర్ణాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

March 12, 2026 / 04:35 PM IST

సాయంత్రం ఆకలి వేస్తుందా..?

సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఆకలి వేయడం సహజం. ఈ సమయంలో చాలామంది సమోసాలు, బిస్కెట్లు వంటి జంక్ ఫుడ్ తింటారు. దీంతో కొవ్వు, గ్యాస్ సమస్యలు వస్తాయి. వాటికి బదులు బాదం, వాల్‌నట్స్, వేయించిన శనగలు, పండ్లు తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు అందించి ఆకలిని తీరుస్తాయి. ఈ ఆరోగ్యకరమైన అలవాటు బరువును నియంత్రించడమే కాకుండా, రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.

March 12, 2026 / 03:50 PM IST

కళ్లు ఎర్రబడ్డాయా? కారణం ఇదే కావచ్చు!

కంటి తెల్లసొనపై అకస్మాత్తుగా కనిపించే ఎర్రటి మచ్చను ‘సబ్ కంజంకైవల్ హేమరేజ్’ అంటారు. ఇది రక్తనాళం పగిలి రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడుతుంది. గట్టిగా దగ్గడం, తుమ్మడం లేదా హైబీపీ వల్ల ఇలా జరుగుతుంది. ఇది చూపుపై ప్రభావం చూపదు. ఒకటి రెండు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ నొప్పిగా ఉన్నా, చూపు మసకబారినా వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిది.

March 12, 2026 / 02:40 PM IST

రోజూ కుండ నీరు తాగితే కలిగే లాభాలు

కుండ నీరు శరీరానికి చలువ చేస్తాయి. మట్టి కుండలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి ప్రసరించి, నీరు సహజంగానే చల్లబడుతుంది. ఇక ఈ నీరు తాగడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మంట, అజీర్తి సమస్యలతో బాధపడేవారికి మట్టి కుండ నీరు గొప్ప వరం. శరీరంలోని మెటబాలిజం రేటు పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

March 12, 2026 / 02:25 PM IST

వీటిని నానబెడితేనే మంచిది

డ్రైఫ్రూట్స్, గింజలను నానబెట్టి తింటే పోషకాలు రెట్టింపై త్వరగా జీర్ణమవుతాయి. కిస్మిస్‌లు, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి తీసుకోవాలి. సబ్జా గింజలను నానబెట్టి తీసుకుంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి బరువు తగ్గిస్తాయి. ఓట్స్, పప్పులను వండే ముందు నానబెట్టడం వల్ల వాటిలోని సంక్లిష్ట చక్కెరలు విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

March 12, 2026 / 12:46 PM IST

బాడీ రీఛార్జ్ కావాలా? కొబ్బరి నీళ్లు తాగండి!

వేసవిలో శరీరం తరచూ అలసట, డీహైడ్రేషన్‌కు గురవుతుంది. వీటిని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని పొటాషియం, మెగ్నీషియం వల్ల బీపీ అదుపులో ఉండి, కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి. ఇంకా శరీర వేడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం.

March 12, 2026 / 12:13 PM IST