సగ్గుబియ్యంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలకు సగ్గుబియ్యం జావ ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నరాల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. యాంగ్జైటీ, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.
ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. దేశంలో క్షయవ్యాధి నిర్మూలనే టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఉద్దేశ్యమని ప్రిన్సిపాల్ డా.కేబీకే నాయక్ అన్నారు. క్షయవ్యాధి లక్షణాలను అరకు ఏరియా ఆసుపత్రి డా.ఆదిత్య వివరించారు. ఎవరైనా టీబీ లక్షణాలతో బాధపడుతుంటే ఏరియా ఆసుపత్రికి తీసుకురావాలని డాక్టర్ కోరారు.
AKP: చీడికాడ మండలం జైతవరంలో శుక్రవారం మహిళా సంరక్షణ కార్యదర్శి సుధారాణి ఆధ్వర్యంలో హెచ్ఐవీ, మత్తు పదార్ధాల వినియోగంపై అవగాహన కల్పించారు. మత్తు పదార్ధాల వలన యువకుల జీవితాలు నాశనమవుతున్నాయని, కావున మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ పట్ల జాగ్రత్తలు పాటించాలని, వీటిపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
కొన్ని చిట్కాలతో కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బంగాళాదుంప ముక్కలను లేదా దాని రసాన్ని కళ్ల కింద పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐస్ క్యూబ్స్‌ను క్లాత్‌లో చుట్టి కళ్ల కింద రుద్దాలి. దోసకాయ ముక్కలను పెట్టాలి. కొబ్బరి లేదా బాదం నూనెలను కళ్లకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల సమస్య తగ్గుతుంది.
రోజులో రెండు నుంచి నాలుగు కప్పుల ‘టీ’ తాగితే జీవితకాలం పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీ తాగడం వల్ల మతిమరుపు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది. గ్రీన్, బ్లాక్ టీ వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న ఫైటోకెమికల్స్ ఉంటాయని చెబుతున్నాయి. టీని మరిగించే సమయాన్నిబట్టి దానిలోని పోషకాలు లభిస్తాయని, రెండు నిమిషాలే మరిగించాలని పేర్కొన్నాయి.
పెరుగు తింటే జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుందని.. ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక.. వారానికి రెండు, అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి కుడివైపున వచ్చే పెద్ద పేగు క్యాన్సర్.. ముప్పు తగ్గుతున్నట్టు వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కన్నా కుడి వైపు క్యాన్సర్ తీవ్రమైంది కావటం గమనార్హం.
ఎక్కువ టూత్ పెస్ట్ పెట్టుకుని పళ్లు తోమితే నోరు, దంతాలు మరింత శుభ్రంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ పేస్టు అధికంగా వాడితే.. రోగాల బారిన పడుతారని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులో సోడియం ఫ్లోరైడ్ ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా ఉపయోగిస్తే దంతాలపై క్యావిటీస్ ఏర్పడుతాయి. పిల్లల్లో ఫ్లోరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా చిగుళ్ల ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.
SRD: పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈనెల 17 నుంచి మార్చి 15వ తేదీ వరకు కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి సోమవారం తెలిపారు. సంగారెడ్డి జనరల్ హాస్పిటల్ జోగిపేట, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌లో కంటి వైద్య పరీక్షలు జరుగుతాయని ఆమె చెప్పారు.
SKLM: గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి విభిన్న ప్రతిభా వంతులను గుర్తించాలని నరసన్నపేట జూనియర్ సివిల్ న్యాయాధికారి సీహెచ్. హరిప్రియ అన్నారు. ఉర్లం జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ C, A, B6, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంతోపాటు ఎముకలను ధృఢంగా ఉంచుతాయి. హైబీపీ, ఆయాసం, దగ్గు, కళ్ల సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా గోంగూర తినడం వల్ల రక్త హీనత, మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
మెనోపాజ్‌లో ఎదురయ్యే సమస్యల్లో పొట్ట పెరగటం కూడా ఒకటి. గంటల తరబడి కూర్చోని పనిచేసే వారిలో ఇది మరింత ఎక్కువ. అలాకాకుండా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, అవిసె గింజలు, ఓట్స్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు. తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గితే పొట్ట చాలావరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
రాత్రిళ్లు చాలా మంది ఫోన్ చూస్తూ నిద్రపోకుండా ఉంటారు. అలా చేస్తే నిద్రలేమి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి కారణంగా బాడీలోని మెలటోనిన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోయి క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి శరీరానికి నీళ్లు, ఆహారంతో పాటు సరిపడా నిద్ర కూడా అంతే అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
నల్ల ద్రాక్ష తినడం వల్ల పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహ బాధితులు నల్ల ద్రాక్ష తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఇనుప కడాయిల్లో చేసిన వంటకాలు రుచిగా ఉంటాయి. అయితే కొన్నింటిని ఐరన్ కడాయిల్లో చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. టొమాటో, చింతపండు, నిమ్మకాయతో చేసే వంటలు ఐరన్‌తో రియాక్ట్ అవుతాయి. వంకాయ, పాలకూర వంటివి ఇనుప కడాయిలో వండకూడదు. కోడిగుడ్డు, బీట్‌రూట్, తీపి పదార్థాల రుచి పోతుందట. అయితే ఇనుప కడాయి వాడకానికి ముందు నూనె పట్టించి, రుద్ది.. క్లీన్ చేశాక వాడుకోవాలి.
కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. వచ్చే కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పనిచేద్దాం! ఇది విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు మార్పు అనేది వయసుతో సంబంధం లేదు. ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని మనందరి నమ్మకం. అందుకే కొత్త ఏడాదిని కొత్తగా ప్రారంభించండి. అనుకున్న ఫలితాలు సాధించండి. ALL THE BEST