• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు..?

చాలామందికి జీతం పెరిగినప్పుడు దానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి. ఆర్థిక పరిభాషలో దీన్ని ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అంటారు. అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ, మనకు తెలియకుండానే మన జీవనశైలి ఖరీదైనదిగా మారిపోతుంది. పెరిగిన ఆదాయంతో ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన వస్తువుల మీద మొగ్గు చూపుతారు. ఈ అలవాట్లే క్రమంగా అవసరాలుగా మారి, పొదుపును అడ్డుకుంటాయి.

April 14, 2026 / 04:14 PM IST

చెమట ఎక్కువగా పడుతోందా?

అధికంగా చెమట పట్టడం వల్ల డీహైడ్రేషన్ ముప్పు ఉంటుంది. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. పచ్చిమిర్చి, మసాలాలు శరీర వేడిని పెంచుతాయి. కాబట్టి వీటిని తగ్గించాలి. టీ, కాఫీల్లోని కెఫీన్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. వీటిని నియంత్రించాలి.ఒత్తిడి తగ్గించుకోవాలి.గాలి తగిలేలా వదులైన కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం.

April 14, 2026 / 03:28 PM IST

130 కోట్ల మందిలో లివర్ సమస్య

2023 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మంది కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు ది లాన్సెట్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ జర్నల్ తెలిపింది. ఈ సంఖ్య 1990తో పోలిస్తే 143 శాతం పెరిగినట్లు చెప్పింది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం వంటి కారణాలు దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఈ సమస్య కేవలం పెద్దల్లోనే కాకుండా యువతుల్లోనూ కనిపిస్తుందటం ఆందోళన కలిగించే అంశం.

April 14, 2026 / 11:09 AM IST

మంచిమాట: లక్ష్యం లేని జీవితం దిశలేని నావ

వ్యక్తిగత విజయానికి స్పష్టమైన లక్ష్యం ముఖ్యం. లక్ష్యం లేని జీవితం దిశలేని నావలాంటింది. లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇలా ప్రయత్నించండి. లక్ష్యానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో దానిని కాగితంపై రాసుకోండి. తర్వాత లక్ష్యాల సాధనను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైతే సవరించుకోండి.

April 14, 2026 / 10:44 AM IST

క్యారెట్ జ్యూస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని బీటా-కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచగా, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

April 14, 2026 / 10:00 AM IST

కాళ్ల బలాన్ని పెంచే గుంజీలు

గుంజీలు కేవలం వ్యాయామం మాత్రమే కాదు. కూర్చోవడం, నిలబడడం, మెట్లెక్కడం వంటి కదలికలకు మూలాధారం. నిత్యం గుంజీలు తీస్తే కాళ్ల బలం మూడురెట్లు పెరుగుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెరస్థాయిలు మెరుగుపడటంతో పాటు ఎముకల సాంధ్రత పెరుగుతుంది. 10 ఏళ్లపాటు నిర్వహించిన రెండు అధ్యాయాల్లో శక్తివంతమైన కాళ్లు కలిగినవారి మెదడు ఆరోగ్యకరంగా, చురుగ్గా ఉంటుందని తేలింది.

April 14, 2026 / 09:49 AM IST

ముఖంపై అవాంఛిత రోమాలను ఇలా తొలగించుకోండి

ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో ముఖంపై ఉండే అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చని నిపుణులు తెలిపారు. అది ఎలాగంటే.. 1. శనగపిండి+పసుపు స్క్రబ్ 2. చక్కెర+ నిమ్మరసం స్క్రబ్ 3. ఓట్స్+ అరటిపండు స్క్రబ్ 4. పెసరపిండి+ పాలు స్క్రబ్ 5. బొప్పాయి+పసుపు స్క్రబ్‌లను ఉపయోగించి మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.

April 14, 2026 / 03:34 AM IST

నైట్ పళ్లు తోముకుంటున్నారా?

రాత్రిపూట పడుకునే ముందు తప్పనిసరిగా దంతాలు శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నైట్ పళ్లు తోముకుంటే దంతాల మధ్యలో ఇరుక్కున్న ఆహారకణాలు తొలగిపోతాయి. అయితే డిన్నర్ చేసిన వెంటనే కాకుండా కనీసం అరగంట ఆగి బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

April 13, 2026 / 09:40 PM IST

ఎండలోకి వెళ్తే తల నొప్పి వస్తుందా?

ఎండలోకి వెళ్ళినప్పుడు తల బాదుతున్నట్లు అనిపించడానికి ప్రధాన కారణం శరీరం డీహైడ్రేషన్. ఎండ వేడికి మెదడులోని రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల ఈ తలనొప్పి వస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే రోజంతా తగినంత నీరు, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ ధరించడం వల్ల నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్త పడవచ్చు.

April 13, 2026 / 08:49 PM IST

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే!

రోజంతా చురుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉత్సాహంగా ఉండాలంటే మానసిక, శారీర ఆరోగ్యం బాగుండాలి. అందుకోసం ప్రతిరోజు కాసేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. సమయానికి నిద్రపోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

April 13, 2026 / 07:53 PM IST

నెలసరి ఆలస్యం అవుతుందా..?

నెలసరి ముందుగా లేదా ఆలస్యం అవడానికి జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సమస్యలూ కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న విషయాలకే ఆందోళన చెందడం, డైటింగ్ పేరుతో ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుందంటున్నారు. మితిమీరిన వ్యాయామం, దీర్ఘకాల నిద్రలేమి, మెడిసిన్స్ ప్రభావం కూడా నెలసరిపై పడుతుందట. దీనిపై డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోండి.

April 13, 2026 / 06:55 PM IST

అందుకే తమలపాకు మంచిదట!

తమలపాకుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకు నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గి దంతాలు దృఢంగా మారుతాయి. చర్మంపై దురద, అలర్జీ వంటి సమస్యలు దూరమవుతాయి. గాయాలు త్వరగా మానడంలో ఇది తోడ్పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో ఇది సహాయపడుతుంది. బరువును, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

April 13, 2026 / 05:16 PM IST

చుండ్రు తగ్గించే హెయిర్‌ ప్యాక్!

చుండ్రును తగ్గించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. 3 స్పూన్ల హెన్నా పొడి, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, 2 స్పూన్ల గుడ్డు తెల్లసొన కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి 45 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. పెరుగు, నిమ్మరసం మిశ్రమం, వేపాకు పేస్ట్ కూడా చుండ్రును సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

April 13, 2026 / 04:12 PM IST

పిల్లల ముందే గొడవపడుతున్నారా?

పిల్లల ఎదుట తల్లిదండ్రులు గొడవపడటం వారి సున్నితమైన మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల పిల్లల్లో భయం, ఆందోళన పెరిగి, వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తల్లిదండ్రులపై నమ్మకం తగ్గి, వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది వారిని మొండిగా, దూకుడుగా మార్చడమే కాకుండా, భవిష్యత్తులో ప్రవర్తనా లోపాలకు దారితీస్తుంది. కాబట్టి పిల్లల ప్రశాంతత కోసం గొడవలకు దూరంగా ఉండాలి.

April 13, 2026 / 12:40 PM IST

బ్రోకలీతో ఆరోగ్య ప్రయోజనాలు

బ్రోకలీ ఒక అద్భుతమైన సూపర్‌ఫుడ్. ఇందులో విటమిన్ C, K, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, క్యాన్సర్ నివారణకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఎముకలను దృఢంగా మారుస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరిచి బరువు తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ C చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

April 13, 2026 / 11:09 AM IST