నెలసరి ముందుగా లేదా ఆలస్యం అవడానికి జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సమస్యలూ కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న విషయాలకే ఆందోళన చెందడం, డైటింగ్ పేరుతో ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుందంటున్నారు. మితిమీరిన వ్యాయామం, దీర్ఘకాల నిద్రలేమి, మెడిసిన్స్ ప్రభావం కూడా నెలసరిపై పడుతుందట. దీనిపై డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోండి.