• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

ముఖంపై అవాంఛిత రోమాలను ఇలా తొలగించుకోండి

ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో ముఖంపై ఉండే అవాంచిత రోమాలను తొలగించుకోవచ్చని నిపుణులు తెలిపారు. అది ఎలాగంటే.. 1. శనగపిండి+పసుపు స్క్రబ్ 2. చక్కెర+ నిమ్మరసం స్క్రబ్ 3. ఓట్స్+ అరటిపండు స్క్రబ్ 4. పెసరపిండి+ పాలు స్క్రబ్ 5. బొప్పాయి+పసుపు స్క్రబ్‌లను ఉపయోగించి మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.

April 14, 2026 / 03:34 AM IST

నైట్ పళ్లు తోముకుంటున్నారా?

రాత్రిపూట పడుకునే ముందు తప్పనిసరిగా దంతాలు శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నైట్ పళ్లు తోముకుంటే దంతాల మధ్యలో ఇరుక్కున్న ఆహారకణాలు తొలగిపోతాయి. అయితే డిన్నర్ చేసిన వెంటనే కాకుండా కనీసం అరగంట ఆగి బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

April 13, 2026 / 09:40 PM IST

ఎండలోకి వెళ్తే తల నొప్పి వస్తుందా?

ఎండలోకి వెళ్ళినప్పుడు తల బాదుతున్నట్లు అనిపించడానికి ప్రధాన కారణం శరీరం డీహైడ్రేషన్. ఎండ వేడికి మెదడులోని రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల ఈ తలనొప్పి వస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే రోజంతా తగినంత నీరు, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ ధరించడం వల్ల నేరుగా ఎండ తగలకుండా జాగ్రత్త పడవచ్చు.

April 13, 2026 / 08:49 PM IST

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే!

రోజంతా చురుగ్గా ఉండాలని చాలామంది కోరుకుంటారు. అలా ఉత్సాహంగా ఉండాలంటే మానసిక, శారీర ఆరోగ్యం బాగుండాలి. అందుకోసం ప్రతిరోజు కాసేపు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. టిఫిన్ స్కిప్ చేయొద్దు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజూ పుష్కలంగా నీళ్లు తాగాలి. సమయానికి నిద్రపోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

April 13, 2026 / 07:53 PM IST

నెలసరి ఆలస్యం అవుతుందా..?

నెలసరి ముందుగా లేదా ఆలస్యం అవడానికి జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సమస్యలూ కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న విషయాలకే ఆందోళన చెందడం, డైటింగ్ పేరుతో ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుందంటున్నారు. మితిమీరిన వ్యాయామం, దీర్ఘకాల నిద్రలేమి, మెడిసిన్స్ ప్రభావం కూడా నెలసరిపై పడుతుందట. దీనిపై డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోండి.

April 13, 2026 / 06:55 PM IST

అందుకే తమలపాకు మంచిదట!

తమలపాకుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకు నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గి దంతాలు దృఢంగా మారుతాయి. చర్మంపై దురద, అలర్జీ వంటి సమస్యలు దూరమవుతాయి. గాయాలు త్వరగా మానడంలో ఇది తోడ్పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, దగ్గు, జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో ఇది సహాయపడుతుంది. బరువును, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

April 13, 2026 / 05:16 PM IST

చుండ్రు తగ్గించే హెయిర్‌ ప్యాక్!

చుండ్రును తగ్గించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. 3 స్పూన్ల హెన్నా పొడి, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, 2 స్పూన్ల గుడ్డు తెల్లసొన కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి 45 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. పెరుగు, నిమ్మరసం మిశ్రమం, వేపాకు పేస్ట్ కూడా చుండ్రును సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

April 13, 2026 / 04:12 PM IST

పిల్లల ముందే గొడవపడుతున్నారా?

పిల్లల ఎదుట తల్లిదండ్రులు గొడవపడటం వారి సున్నితమైన మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల పిల్లల్లో భయం, ఆందోళన పెరిగి, వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తల్లిదండ్రులపై నమ్మకం తగ్గి, వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఇది వారిని మొండిగా, దూకుడుగా మార్చడమే కాకుండా, భవిష్యత్తులో ప్రవర్తనా లోపాలకు దారితీస్తుంది. కాబట్టి పిల్లల ప్రశాంతత కోసం గొడవలకు దూరంగా ఉండాలి.

April 13, 2026 / 12:40 PM IST

బ్రోకలీతో ఆరోగ్య ప్రయోజనాలు

బ్రోకలీ ఒక అద్భుతమైన సూపర్‌ఫుడ్. ఇందులో విటమిన్ C, K, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, క్యాన్సర్ నివారణకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఎముకలను దృఢంగా మారుస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరిచి బరువు తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ C చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

April 13, 2026 / 11:09 AM IST

చియా సీడ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

ఒక స్పూన్ చియా గింజలను నీటిలో నానబెట్టి స్మూతీ లేదా మజ్జిగలో కలిపి తీసుకోండి. ఇవి శరీర వేడిని తగ్గిస్తాయి. పాల కంటే ఎక్కువ కాల్షియం కలిగిన ఇవి ఎముకల బలానికి మేలు. అధిక ఫైబర్, ఒమేగా-3, ప్రోటీన్లు బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడతాయి. రోజూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారడంతో పాటు షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి.

April 12, 2026 / 05:36 PM IST

డబ్బు విషయంలో గొడవ పడుతున్నారా?

నేటి దంపతుల్లో ఆర్థిక స్వాతంత్య్రం కలహాలకు దారితీస్తోంది. ఆదాయం, ఖర్చుల విషయంలో పారదర్శకత లేకపోవడం వల్ల దూరం పెరుగుతోంది. అందుకే సంపాదన, పొదుపు, పెట్టుబడుల విషయాల్లో భార్యాభర్తలు దాపరికం లేకుండా చర్చించుకోవాలి. రుణాల చెల్లింపు, ఆస్తుల కొనుగోలు వంటి నిర్ణయాలు కలిసి తీసుకోవడం వల్ల బాధ్యత పెరుగుతుంది. ఈ కలుపుగోలుతనమే దాంపత్యాన్ని కలకాలం నిలబెడుతుంది.

April 12, 2026 / 05:22 PM IST

వాల్‌నట్స్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

వాల్‌నట్స్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. బరువును నియంత్రించడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో ఇవి సహాయపడుతాయి. రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

April 12, 2026 / 04:41 PM IST

చికెన్ తోలు తింటున్నారా?

చికెన్ తోలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే, దీనిలో అధిక కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. దీని వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. చికెన్ తోలు తినడం వల్ల బరువు పెరుగుతారు. గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా బ్రాయిలర్ కోడి చికెన్ తోలు అస్సలు తినొద్దు. చికెన్ స్కిన్‌లో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెపుతున్నారు.

April 12, 2026 / 01:03 PM IST

నానబెట్టిన బాదం పప్పును తింటే ప్రయోజనాలు

రాత్రి 4-5 బాదం పప్పులను నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పొట్టులోని ‘టానిన్లు’ పోషకాల శోషణను అడ్డుకుంటాయి. నానబెట్టి పొట్టు తీయడం వల్ల విటమిన్లు, ఎంజైమ్‌లు శరీరానికి బాగా అందుతాయి. ఇది జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

April 12, 2026 / 12:12 PM IST

రాగి పాత్రలోని నీళ్లు.. అమృతం లాంటివి!

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు నీటిని రాగి పాత్రలో పోసి, ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, థైరాయిడ్ గ్రంథిని క్రమబద్ధీకరించడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది..

April 12, 2026 / 11:31 AM IST